తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని రహదారులు దారుణంగా ఉన్నాయి. పట్టణంలోని కొన్ని రోడ్లు గుంతలమయం కావడంతో వర్షపు నీరు నిలిచింది. రాకపోకలు సాగించేందుకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి రోడ్లు బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు. సూళ్లూరుపేట పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలోనూ రోడ్లు ఇలాగే ఉన్నాయి.