సూళ్లూరుపేట నియోజకవర్గం తూపిలిపాలెం బీచ్ లో వినాయక చవితి నిమజ్జనంలో సోమవారం అపశృతి చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా సముద్రంలో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. నాయుడుపేట కామారెడ్డి సెంటర్ నుండి నిమజ్జనానికి తూపిలిపాలెం బీచ్ కు వచ్చిన యువకుల్లో ముగ్గురు యువకులు సముద్రంలో గల్లంతయ్యారు. వారిలో మునిరాజా, ఫయాజ్ మృతి చెందగా మరో యువకుడిని గజ ఈతగాళ్లు సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు.