తంబళ్లపల్లి తహశీల్దార్ విధులకు ఆటంకం కలిగించిన ఏడు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహుడు తెలిపారు. శనివారం పీటీఎం మండలం వరికాసులపల్లి కి చెందిన అస్వత్ రెడ్డి, హరీశ్ మరో ఐదుగురు ప్రైవేట్ స్థలంలో మట్టి తవ్వవద్దని వెళ్లిన తహశీల్దార్ శ్రీరాముల నాయక్ విధులకు ఆటంకం కలిగించారని తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ఆదివారం ఏడుగురిపై కేసు రిజిస్టర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.