తిరుమల తిరుపతి దేవస్థాన పాపవినాశనం ఆవరణంలో అన్యమత ప్రచారానికి పాల్పడ్డ ఇద్దరు మహిళలపై తిరుమల టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పాపవినాశనం వద్ద శంకరమ్మ, మీనాక్షి భక్తుల ముందే ఆదివారం ఓ మతానికి సంబంధించి పాటలకు రీల్స్ చేయడం పెను దుమారం రేపింది. దీంతో భక్తుల ఫిర్యాదు మేరకు ఆదివారం టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.