తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట తిరుపతి రూరల్ మండలం పాతకాల్వ గ్రామ భూబాధితులు మంగళవారం ఆందోళన చేపట్టారు. తమ సర్వేనెంబర్ 197/2లోని హద్దులను చూపుతూ 191/1లో హద్దులు మార్చుకున్నారని ఆరోపించారు. కోర్టులో ఓ. ఎస్. నెం. 1149/2022 కేసు జరుగుతుండగా దౌర్జన్యంగా స్థలంలోకి ప్రవేసిస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే కేసులు నమోదు చేశారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆర్డీవో రామ్ మోహన్ వినతిపత్రం అందజేశారు.