యువత ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడకూడదని చిత్తూరు టూటౌన్ సీఐ నెట్టి కంటయ్య మంగళవారం తెలిపారు. చిత్తూరు జికే నగరు చెందిన రేవంత్ కుమార్ 10వ తేదీన ఆన్లైన్ బెట్టింగ్, గేమ్స్, చెడు వ్యసనాలకు బానిసై అప్పుల బాధ భరించలేక ఉరి వేసుకుని మృతి చెందారన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని యువతకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని కోరారు.