AP: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులకు ఏపీ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ కారణాల వల్ల మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారికి మరో అవకాశం కల్పించింది. తత్కాల్ విధానం కింద ఫీజు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పరీక్షల విభాగం సంచాలకులు కేవీ శ్రీనివాసులు రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తత్కాల్ కింద రూ.1000 ఫైన్‌తో ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు పే చేయవచ్చని పేర్కొన్నారు.