నేటి కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా ఓ యువకుడు ఫేమ్ కోసం ఏకంగా ఆడవారు కట్టుకునే చీర కట్టుకుని రాత్రి వేళలో నడిరోడ్డుపై రీల్స్ చేశాడు. ఇది చూసిన మరో యువకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.