మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి SIP బెస్ట్ ఆప్షన్. అయితే SIP ఎంత కట్టాలి.. ఎంత కాలం కడితే బెటర్ వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకు 20 ఏళ్లపాటు నెలకు రూ.2,100 ఇన్వెస్ట్ చేశామనుకుంటే చివరికి రూ.20.98 లక్షలు కార్పస్ క్రియేట్ అవుతోంది. అలాగే రూ.5,100లను 10 ఏళ్లు కడితే రూ.11.85 లక్షల సంపద జనరేట్ అవుతుంది. దీనిని బట్టి చూస్తే కాంపౌండింగ్ చాలా పవర్ ఫుల్ అని అర్థం చేసుకోవచ్చు.