ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. రాజధాని అమరావతికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తున్న రూ.15వేల కోట్ల రుణం, తదితర అంశాలపై మంత్రితో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. తొలుత ఆమెకు పుష్పగుచ్ఛం అందించి, దేవుని చిత్రపటం బహుకరించారు. నిర్మలా సీతారామన్‌తో భేటీ ముగిసిన తర్వాత విదేశాంగశాఖ మంత్రి జై శంకర్‌తో సీఎం సమావేశమయ్యారు.