AP: సీఎం చంద్రబాబు మంగళవారం బాపట్ల జిల్లా చినగంజాం మండలంలో పర్యటిస్తారు. కొత్తగొల్లపాలెం గ్రామంలో లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేస్తారు. లబ్ధిదారుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. అనంతరం దివ్యాంగులకు స్కూటీలు అందజేస్తారు. ఆ తర్వాత స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. బాపట్లలో పార్టీ నేతలతో సమావేశమైన తర్వాత తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.