AP: రాష్ట్రంలో జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుండగా.. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడతారనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం అసెంబ్లీ సీటు హాట్ టాపిక్‌గా మారింది. పిఠాపురంలో ఎన్నికల ఫలితం మధ్యాహ్నానికే తెలిసిపోతుందని సమాచారం. రాష్ట్రంలో తొలి ఫలితం తూ.గో జిల్లా కొవ్వూరు లేదా ప.గో జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశం ఉంది.