ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై దాడి చేసిన ఆరు వీధి కుక్కలు

1053చూసినవారు
ఓ ఇంటి బయట ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై ఆరు వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పూణేలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ బాలుడు దారి వెంట వెళ్తుండగా ఓ కుక్క ఎదురవడంతో దానిని చేతులు ఆడిస్తూ బెదిరించడం వీడియోలో కనిపించింది. అయితే అకస్మాత్తుగా మరొ కుక్క వేగంగా వచ్చి అతనిపై దాడి చేసింది. వెంటనే మిగతా కుక్కలు పిల్లడిని చుట్టుముట్టి దాడి చేశాయి. గమనించిన స్థానికులు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమివేశారు.

సంబంధిత పోస్ట్