రింగ్ రోడ్డు పైనుంచి పల్టీ కొడుతూ కింద పడిన లారీ (వీడియో)

60చూసినవారు
హైదరాబాద్‌ నగర శివారులోని ఔటర్‌ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పైనుంచి లారీ పల్టీలు కొడుతూ కింద పడిపోయింది. పెద్ద అంబర్‌పేట సమీపంలోని తారామతిపేట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘట్‌కేసర్‌ నుంచి ఐరన్‌ లోడ్‌తో బెంగళూరు బయల్దేరిన లారీ.. అదుపుతప్పి పల్టీ కొడుతూ సర్వీస్‌ రోడ్డుపై పడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతిచెందగా.. క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్