అటుకుల ప్యాకెట్‌లో పురుగులు (వీడియో)

84చూసినవారు
అటుకుల(పోహ) ప్యాకెట్ కొనుగోలు చేసిన ఓ కస్టమర్‌కి చేదు అనుభవం ఎదురైంది. తిందామని దానిని ఓపెన్ చేయగా అందులో పురుగులు కనిపించాయి. దీంతో కస్టమర్ కంగుతిన్నాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో పుష్పేందర్ సింగ్ అనే వ్యక్తి మూడు రోజుల క్రితమే సమీపంలోని దుకాణంలో అటుకుల ప్యాకెట్‌ను కొనుగోలు చేశాడు. ఆదివారం ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో పురుగు పాకడం కనిపించింది. దీంతో వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.

సంబంధిత పోస్ట్