AP: తిరుపతి తొక్కిసలాట ఘటన బాధాకరమని, ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని ఎమ్మెల్యే, టీటీడీ బోర్డ్ మెంబర్ MS రాజు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కోసం అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. కానీ కొంతమంది కావాలనే అరుపులు సృష్టించి తొక్కిసలాటకు కారణం అయ్యారని ఆరోపించారు. శవరాజకీయం చేయడం YCPకి అలవాటని విమర్శించారు. అందరికంటే ముందు ప్రమాద వీడియోలు ఆ పార్టీ సోషల్ మీడియాలోకి ఎలా వచ్చాయని ప్రశ్నించారు.