ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఉదయం కూడా తేలికపాటి పొగమంచు, చలిగాలులు వీచాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. భారత వాతావరణ విభాగం (IMD) ప్రకారం ఢిల్లీలో ఉదయం 5:30 గంటలకు కనిష్ట ఉష్ణోగ్రత 6.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. జనవరి 9, 10 తేదీల్లో ఢిల్లీలో చాలా దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉండే అవకాశం ఉందని IMD తెలిపింది.