AP: కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో జల్ జీవన్ మిషన్ గురించి కేంద్ర మంత్రితో ఆయన చర్చించారు. ఈ సందర్భంగా ఆయనను సత్కరించి, ప్రత్యేక జ్ఞాపికను అందించారు. ప్రతి ఇంటికి కుళాయి నీటిని సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఏపీ ప్రభుత్వం నిర్దేశించుకుంది.