ఉద్యోగాలంటే ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్, ఇంజినీర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాంటివి మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఉన్నాయనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. మీ కలలను మీ పిల్లలు సాకారం చేయాలని ఆశించొద్దు. పిల్లలపై మోయలేని భారం మోపకుండా.. వారి అభిరుచులకు ప్రాధాన్యం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చెప్పడం.. ఏదేమైనా నీకు అండగా మేం ఉన్నామనే భరోసా ఇస్తే ఫలితం ఉంటుంది.