నేడు, రేపు విశాఖలో డ్రోన్లపై నిషేధం

72చూసినవారు
నేడు, రేపు విశాఖలో డ్రోన్లపై నిషేధం
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన సందర్భంగా మంగళ, బుధవారం ఆయా ప్రాంతాల్లో డ్రోన్లు వినియోగాన్ని నిషేధించారు. ఈ మేరకు నగర పోలీసులు డ్రోన్ కెమెరాల యజమానులకు నోటీసులు జారీ చేశారు. ప్రధాని సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం వద్దే కాకుండా ఆయన పర్యటించే పరిసర ప్రాంతాలకు 5 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్ కెమెరాలను ఎటువంటి పరిస్థితుల్లో కూడా వినియోగించరాదని స్పష్టం చేశారు. వినియోగిస్తే వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్