మద్యం మత్తులో హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి (వీడియో)

67చూసినవారు
AP: విధి నిర్వహణలో ఉన్న హోంగార్డుపై మద్యం మత్తులో ఉన్న ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. పల్నాడులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాచర్లలో నైట్ బీట్ నిర్వహిస్తున్న హోంగార్డు శ్రీనివాస్ వద్దకు కానిస్టేబుల్ మల్లికార్జున మద్యం తాగి వచ్చాడు. అకారణంగా శ్రీనివాస్‌పై దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్