పెదపూడి మండలం దోమడ గ్రామంలో దుర్గమ్మ తల్లి గుడి దగ్గర వున్నా శ్రీ విగ్నేశ్వర స్వామివారిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం స్వామి వారి ఆలయ సన్నిధిలో వినాయక అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నసమరాధన వడ్డించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కాకర్ల గోవిందు, సవరపు చిట్టిబాబు, గుణ్ణం వెంకటేశ్వరరావు, పాలచర్ల వెంకట్రావు, స్థానిక నాయకులు ఉన్నారు.