పెదపూడి మండలం దోమాడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను, స్టిక్కర్లను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 100 రోజులు కూటమి పాలనలో ఏం చేసామో ప్రజలకు తెలిపేందుకే కార్యక్రమానికి శ్రీకారం చెప్పినట్లు తెలిపారు.