TG: ఏపీలో జగన్ హయాంలో తిరుమల లడ్డూలలో వివిధ రకాల జంతువుల నూనెలు కలపడం దుర్మార్గమని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. జగన్ ఒక పాపిష్టి సీఎం అని దుయ్యబట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యవహరించారని ఆయన ఆగ్రహించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని ప్రస్తుత సీఎం చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని రాజాసింగ్ కోరారు.