అమెరికాకు చెందిన ధృవీ పటేల్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 విజేతగా నిలిచారు. న్యూజెర్సీలోని ఎడిసన్‌లో ఆమెకు నిర్వాహాకులు మిస్ ఇండియా వరల్డ్ వైడ్-2024 కిరీటం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ధృవీ పటేల్ మాట్లాడుతూ.. ఈ పోటీల్లో విజేతగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఇది అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. మిసెస్, టీన్ కేటగిరీల్లో సుఅన్ మౌటెట్, సియర్రా విజేతలు.