జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆర్జే కర్ సంఘటనపై న్యాయం జరిగే వరకు ఆందోళన ఉధృతం చేస్తామని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయదేవ్, అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న కుమార్, ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుండి జూడా ల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.