
కాకినాడ: పదవి విరమణ పొందిన హోంగార్డులకు చెక్కులు అందజేత
ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో పదవి విరమణ పొందిన హోంగార్డులకు చెక్కులు అందజేయడం జరిగిందని జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదవి విరమణ పొందిన హోంగార్డులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. పదవీ విరమణ పొందిన విజయ్ కుమార్ కు డిప్యూటేషన్ లో ఉన్న హోంగార్డ్స్ తమ ఒకరోజు వేతనం ఇవ్వడం జరిగిందన్నారు.