నిడదవోలు: బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం
ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో కరెంట్ షాక్‌తో మృతి చెందిన నలుగురు యువకుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రి దుర్గేశ్ హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలను మంగళవారం తాడిపర్రులో పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాకు సంబంధించిన చెక్‌ను సబ్ కలెక్టర్ ద్వారా అందజేసినట్టు ఆయన తెలిపారు.