నిడదవోలు నుంచి నరసాపురం వెళ్లే ప్రధాన రహదారిలో పెరవలి మండలంలోని కాపవరం గ్రామం వద్ద రోడ్డు పక్కన గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయిన చెత్తతో వాహనదారులు, స్థానిక చిరు వ్యాపారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలిపారు. చెత్త నుంచి దుర్వాసన వస్తుందని, పెద్ద ఎత్తున దోమలు కూడా సంచరిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.