ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం బాణసంచా తయారీ కేంద్రంపై పిడుగు పడింది. దీంతో తయారీ కేంద్రంలో భారీ ఎత్తున్న మంటలు చేలరేగాయి. ఘటనలో ఇద్దరు మృతి చెందారని స్థానికులు తెలిపారు. పలువురు కూలీలు ప్రాణాలు దక్కించుకునేందుకు వరి చేలలోకి పరుగులు తీశారు. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.