రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి
దేవరపల్లి మండలం చిన్నాయగూడెం వద్ద మినీ లారీ తిరగబడి మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నిడదవోలు మండలం తాడిమల్లకు చెందిన ఆరుగురు, కాటకోటేశ్వరానికి చెందిన ఒక్కరు ఉన్నారు. జీడిపిక్కల లోడుతో జంగారెడ్డిగూడెం నుంచి తాడిమల్ల వస్తుండగా లారీ అదుపు తప్పి పంట బోధిలోకి దూసుకుపోయి తిరగబడింది. జీడిపిక్కల బస్తాల కింద చిక్కుకొని మృతిచెందారు.