మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశాల మేరకు నిడదవోలు సంత మార్కెట్లో అనధికార డంపింగ్ యార్డ్ తొలగింపు పనులను మున్సిపల్ అధికారులు శనివారం ప్రారంభించారు. అయితే ఇటీవల అనధికార డంపింగ్ యార్డ్ తొలగించాలని సీపీఎం నాయకులు జువ్వల రాంబాబు ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పనులు ప్రారంభం కావడంతో నేరుగా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.