గొల్లప్రోలులో శ్రీరామ్ విద్యానికేతన్ లో ఆదివారం ఉద్యోగ మేళా నిర్వహించారు. జనసేన పార్టీ నాయకురాలు వినికొండ శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ మేళాకు వివిధ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులు హాజరయ్యారు. హైదరాబాద్ కు చెందిన 3కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఎంపికలు నిర్వహించారు. 61 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. పవన్ కల్యాణ్ ఆశయం మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు.