ఏలేశ్వరంలో క్వారీ నీటికుంటలో మృతదేహం లభ్యం

55చూసినవారు
ఏలేశ్వరంలో క్వారీ నీటికుంటలో మృతదేహం లభ్యం
ఏలేశ్వరం మండలం సి. రాయవరం గ్రామంలోని ఏలేరు లెఫ్ట్ కెనాల్ పక్కనే ఉన్న క్వారీ నీటి కుంటలో బుధవారం అనుమానాస్పద మృతదేహం లభ్యమైంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ప్రత్తిపాడు సీఐ శేఖర్ బాబు, అన్నవరం ఎస్ఐ కిషోర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. మృతుడు సి. రాయవరం గ్రామానికి చెందిన మార్కండేయ పురంలో నివాసముంటున్న గజ్జి అప్పన్న (60)గా గుర్తించామన్నారు.

సంబంధిత పోస్ట్