గోదావరీ ప్రాంతంలోని మూడు లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించినట్లు రాజమండ్రి రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ. చైత్ర వర్షిణి తెలిపారు. సోమవారం రాజమండ్రి కుమారి థియేటర్ నుండి మూడు లంక గ్రామాల్లో ఉన్న మత్స్యకార కుటుంబాలను రాజమండ్రిలో ఏర్పాటుచేసిన మున్సిపల్ కళ్యాణ్ మండపం చందా సత్రం పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు.