అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిసెంబర్ 8వ తేదీ ఆదివారం జాతీయ ఉపకార వేతన పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేశ్ కుమార్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు ఉపకార వేతన పరీక్ష రాసేందుకు 2, 815 మంది దరఖాస్తు చేసుకున్నారని వీరికి మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 13 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.