అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో బస్టాండ్ వద్ద పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులు మెరుగైన వైద్యం అందించాలని బీఎస్పీ అమలాపురం నియోజవర్గం ఇన్ఛార్జ్ పొలమూరు మోహన్ బాబు డిమాండ్ చేశారు. అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని పరామర్శించారు. మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, వీధి కుక్కలకు వ్యాక్సిన్లు చేయించాలని కోరారు.