అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో సిద్దేశ్వర స్వామివారిని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా ఆదివారం మంత్రి ఆలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మంత్రి సుభాష్ సిద్దేశ్వర స్వామి వారికి స్వయంగా అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించారు.