కోనసీమలో కోటిపల్లి-నరసాపురం ప్రతిపాదిత రైల్వే లైన్ అలైన్మెంట్ లో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ రైల్వే నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద రైల్వే లైన్ అలైన్ మెంట్లో సంబంధించి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పరిధిలోని సమస్యలపై అధికారులతో చర్చించారు. సమస్యల పరిష్కారంపై సూచనలు చేశారు.