డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం తెల్లవారు జాము నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. పట్టణంలోని సినిమా రోడ్డు, హైస్కూల్ సెంటర్, కాలేజీ రోడ్డు ముమ్మిడివరం గేటు వద్ద రోడ్లన్నీ జలమయమయ్యాయి. దసరా సెలవులకి వివిధ పట్టణాల నుండి అమలాపురం వచ్చేవారు వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు.