దోమడలో 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి

75చూసినవారు
దోమడలో 100 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి
పెదపూడి మండలం దోమడ గ్రామంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సెక్రెటరీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లను లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. గ్రామశాఖ అధ్యక్షులు కాకర్ల గోవిందు మాట్లాడుతూ గ్రామంలో సుమారు 250 పెన్షన్లు ఉండగా 100% పూర్తిగా పంపిణీ చేసినట్లు తెలిపారు. కూటమి నాయకులు, స్థానిక సచివాలయ సిబ్బందితో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్