అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ అండ్ బి రహదారుల మరమ్మతులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 1. 771.77 కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రహదారి మరమ్మతులకు నిధుల మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.