ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మామిడికుదురు మండలం నగరం గ్రామంలో కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పాలాభిషేకం చేశారు. ధాన్యం బకాయిల విడుదల, ఎక్కడైనా ధాన్యం అమ్ముకునే సదుపాయం కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ పాలాభిషేకం చేశారు. రామచంద్రయ్య, సుబ్బారావు, ఉదయ భాస్కర్, ముకరం హుస్సేన్, సురేష్, ఆనంద్ పాల్గొన్నారు.