మామిడికుదురు మండలంలోని అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయ సన్నిధిలో లడ్డూ ప్రసాదం నాణ్యతను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ మాజీ ఛైర్మన్ రాంబాబు, జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులతో కలిసి ఆయన స్వామి ప్రసాదం నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం ఆలయ అధికారులకు ప్రసాదం తయారీకి సంబంధించి పలు సూచనలు చేశారు.