దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలోని ఎస్సీ కాలనీ కొత్తపేటలో ఆదివారం పాస్టర్ తాడిగడప శేఖర్ బాబు ఆధ్వర్యంలో మేరీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఆనందోత్సహంగా జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు డాన్సులు, స్కిట్స్ ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. క్రిస్మస్ సందేశాన్ని పాస్టర్ శేఖర్ బాబు అందిస్తూ, ప్రేమ, సమానత్వం, శాంతి సందేశాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలిపారు.