ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బుధవారం జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీఆర్ఏల రాష్ట్ర సంఘం పిలుపుమేరకు ఆయా మండలాల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఈనెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ధర్నా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు జుత్తు క. నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 2017 వ సంవత్సరంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అలంకార్ సెంటర్ లో వీఆర్ఏలకు అప్పుడు ధర్నాకు హాజరైన వారికి కనీస వేతనం ఇస్తామని నామినిలకు న్యాయం చేయడంతో పాటు ఇతర సమస్యలు అన్ని పరిష్కరిస్తామని ఆనాడు ప్రతిపక్షనేతగా హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు వై ఎస్ ఆర్ సి పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరములు దాటిన పట్టించుకున్న దాఖలాలు లేవు. వారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం అన్యాయమని వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వారు అన్నారు.
మేము మాట ఇస్తే మడమ తిప్పని మాటతప్పని ముఖ్యమంత్రి అని వాగ్దానాలు చేయడమే కాకుండా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ప్రస్తుత ముఖ్యమంత్రి వీఆర్ఏలకు జీతం పెంచుతామని అదేవిధంగా నామినిగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏగా చేస్తామని వాగ్దానం ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్ళు పూర్తవుతున్న తమ సమస్యల పరిష్కారం అవ్వలేదని వారు వాపోయారు. పెరుగుతున్న ధరల వల్ల చాలీచాలని జీతంతో మా కుటుంబాలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. వీఆర్ఏల జీతం 21వేలు చేయాలన్నారు. డి ఎ రిటర్న్ జి ఓ వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రం మొత్తం లో అనేక మంది నామినీగా పనిచేస్తున్నారని వారిని వీఆర్ఏలు గా గుర్తించాలన్నారు. అర్హులైన వారికి వీఆర్వోగా పదోన్నతి కల్పించి మా వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను తక్షణం నెరవేర్చాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడుమండల అధ్యక్షులు కొమరగిరి కృష్ణ, వామపక్షాలు కాంగ్రెస్ నాయకులు, సి ఐ టి యు అధ్యక్షులు ఈశ్వరరావు మండలంలో వీఆర్ఏలు పాల్గొన్నారు.