కార్తీక వన భోజనాల్లో ఉద్రిక్తత నెలకొంది. కాకినాడలో శెట్టిబలిజ కార్తీక వన భోజనాలు ఆదివారం నిర్వహించారు. ఈ వన భోజనాలకు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రి సుభాష్ సమక్షంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ గొడవకు దిగారు.