ఆలమూరు మండలం చెముడులంక 216వ జాతీయ రహదారిపై డివైడర్ (ఓపెన్)ను ఏర్పాటు చేయాలని ఆ గ్రామ సర్పంచ్ తమ్మన శ్రీనివాసు, స్థానిక రైతులు విజ్ఞప్తి చేశారు. చెముడులంక సెంటర్ వద్ద జాతీయ రహదారిపై ఇటీవల అనేక ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని గుర్తించిన హైవే అధికారులు శుక్రవారం ఆ మార్గాన్ని మూసివేయడానికి ప్రయత్నించారు. ఈ మార్గాన్ని మూయవద్దని డివైడర్ ను ఏర్పాటు చేయాలని కోరారు.