చాగల్లు మండలం చాగల్లులో సోమవారం టిడీపీ నాయకులు ఆళ్ళ హరశ్చంద్ర ప్రసాద్ ఆద్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. చాగల్లు లోని జుట్టావారి వీధి పాటమ్మ పేట కొత్తపేటలోని ఇంటింటికి వెళ్లి ఇది మంచి ప్రభుత్వ స్టిక్కర్లలను అంటించి ప్రభుత్వం 100 రోజుల పాలన 100 అభివృద్ధి వివరించారు. కార్యక్రమంలో బిసి కాలనీ సెక్రటరీ ఆళ్ళ శిరీషా రాణి ఎ భాస్కరరావు,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు