మండపేట పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి, అగస్తేశ్వర స్వామివారిని మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి శుక్రవారం దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. కార్తీక మాసం సందర్భంగా స్వామివార్లను దర్శించుకుని పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణ ప్రజలంతా స్వామివారి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.